News June 5, 2024

HYD: ఈటలకు గోల్డెన్ ఛాన్స్..!

image

మల్కాజిగిరి ప్రజలు ఈటలకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా మల్కాజిగిరి ప్రజలు ఎంపీగా గెలిపించారు. కాగా దేశంలో అతిపెద్ద ఎంపీ స్థానమైన ఇక్కడ 2009లో గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా, 2014లో గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా, 2019లో గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈటల కేంద్ర మంత్రి అవుతారా వేచి చూడాలి.

Similar News

News November 11, 2025

HYD: డ్యూయల్ డిగ్రీ BSC కోర్సుకు కౌన్సెలింగ్

image

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ BSC (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు వాక్-ఇన్-కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు PJTAU రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో గురువారం కౌన్సెలింగ్‌కి హాజరు కావాలన్నారు.

News November 11, 2025

BREAKING: జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై NGT కీలక ఆదేశాలు

image

కొన్నేళ్లుగా గ్రేటర్ HYDలోని చెత్తనంతా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా జవహర్‌నగర్‌ డంపింగ్ యార్డుకు కొత్త వ్యర్థాలను పంపడం ఆపాలని GHMCని NGT ఆదేశించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారీ కుప్పల ప్రాసెసింగ్‌ను మాత్రమే అనుమతించింది. తాజాగా ఉత్పన్నమయ్యే ఇంధనం (RDF) వ్యర్థాలు ఆ ప్రదేశంలోకి ప్రవేశించకూడదని, పర్యావరణాన్ని కాపాడేందుకు GHMC చర్యలు తీసుకోవాలని NGT ఆదేశించింది.

News November 11, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.