News March 20, 2024
HYD: ఈటలకు జనసేన మద్దతు ప్రకటన

BJP మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముమ్మడి ప్రేమ్‌కుమర్ ప్రకటించారు. ఈరోజు ఈటలను ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. BJP అభ్యర్థి ఈటలను గెలిపించేందుకు జనసేన కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. BJP, జనసేన శ్రేణులు కలిసి ఈటలను తప్పకుండా గెలిపిస్తాయన్నారు.
Similar News
News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇలా..!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 4 నుంచి 6 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2 నుంచి 3 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
News February 11, 2026
Peoples Pulse.. ఉమ్మడి రంగారెడ్డి ఎగ్జిట్ పోల్స్ ఇవే!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించి 294 వార్డుల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 104-112 వార్డులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BRS 95-104, BJP 16-18, MIM 2-3, CPM 2-3, ఇతరులు 6-8 వార్డులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
News February 11, 2026
హైదరాబాద్: వాటర్ బోర్డ్ విస్తరణ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని 2053 చదరపు కిలోమీటర్ల మేర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలను ఇకపై జలమండలి (HMWSSB) చూసుకోనుంది. గ్రేటర్ పరిధి పెరిగిన నేపథ్యంలో పాత నెట్‌వర్క్‌తో పాటు కొత్త ఎస్టీపీల నిర్మాణం, నిర్వహణ అంతా బోర్డు పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం జీవో 159 జారీ చేసింది.


