News April 18, 2024
HYD: ఈతకు వెళ్లి ఇద్దరి మృతి
జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మిధుల నగర్ క్వారీ గుంతలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసుల ప్రకారం.. అయాన్(16), నవాజ్(16), హైదర్(15) ఈతకోసం దిగారు. సమాచారం అందుకున్న బాచుపల్లి ఎస్సై మహేష్ వెంటనే స్పందించి, ఘటనా స్థలానికి చేరుకొని హైదర్‌ని రక్షించాడు. ఇద్దరు అయాన్, నవాజ్ మృత దేహాలు లభ్యమయ్యాయి. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 20, 2024
HYD: ఆన్‌లైన్‌లో అమ్మాయి కాదు అబ్బాయి!
న్యూడ్ కాల్స్ పేరిట యువకులను మోసం చేస్తున్న వ్యక్తిని HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ వెబ్‌సైట్స్ ద్వారా వల వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బెంగుళూరు వాసి రిషద్ బేడీని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి లాగా ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, పలువురు యువకులను ఆకట్టుకున్నాడు. బాధితుల న్యూడ్ ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
News September 19, 2024
బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం
మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.
News September 19, 2024
BREAKING..HYD: టెండర్లు ఆహ్వానిస్తున్న హైడ్రా
కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 27 వరకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విషయాన్ని ఇదివరకే ప్రకటించింది.