News November 16, 2024

HYD: ‘ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి’

image

రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహసీల్వార్‌ కార్యాలయాలను ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కాచిగూడ హోటల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల స్కాలర్‌షిఫ్‌లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని అన్నారు.

Similar News

News November 14, 2025

HYD: 3ఏళ్లకే రికార్డులు కొల్లగొడుతున్న కార్తీక్ సూర్య

image

వనస్థలిపురంలోని IT ఉద్యోగి ప్రశాంత్, నీరజ కొడుకు కార్తీక్ సూర్య(3)కు 16 నెలల వరకు మాటే రాలే. 3 ఏళ్ల వయసులో అంకెలు గుర్తించి తల్లిని అడిగి తెలుసుకునేవాడు. వారి పెంపకంలో రోజుల వ్యవధిలోనే పెద్ద అంకెలతో కూడిక, తీసివేత, శాతాలు చేయడం మొదలెట్టాడు. కఠిన పదాలకు క్షణాల్లో నోటితోనే కచ్చితమైన సమాధానం చెప్తాడు. ఇండియా, నోబుల్, కిడ్స్, తెలంగాణ, తెలుగు, వరల్డ్ వైడ్, కలాం వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నాడు.

News November 14, 2025

గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

image

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ గెలుపుపై కూనంనేని హర్షం

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యావాదాలు తెలియజేశారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌‌సభ నియోజకవర్గ పరిధి అయిన జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో BJP అభ్యర్థికి డిపాజిట్‌ గల్లంతయ్యిందన్నారు.