News April 10, 2024
HYD: ఈనెల 18 నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు

ఈనెల 18 నుంచి 25 వరకు చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చుకుడు రంగరాజన్ తెలిపారు. 21న బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన బాలాజీ, పద్మావతి, అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం ఉంటుందని, 25న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. నూతన క్రోధి నామ సంవత్సరం నేపథ్యంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.
Similar News
News November 14, 2025
Round 1 Official: నవీన్ యాదవ్ 47 ఓట్ల లీడ్

జూబ్లీహిల్స్ బైపోల్ రౌండ్ 1 ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. తొలి రౌండ్లో నవీన్ యాదవ్కు 8911 (+ 47) ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 (-47) ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2167 (-6744) ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్లో 42 బూత్లలో పోలైన ఓట్లను లెక్కించారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.
News November 14, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మిగిలిన 8 రౌండ్లు కీలకం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో ఆయన ఆధిక్యం 1,144కు చేరింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్కు 9691, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ఇంకా 8 రౌండ్లు మిగిలి ఉండగా.. అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.


