News August 18, 2024
HYD: ఈనెల 20న టీహబ్‌లో ప్రత్యేక సమావేశం

హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్‌లో ఈనెల 20వ తేదీ మ.3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సౌత్ ఏషియన్ విమెన్ ఇన్ టెక్ (ఎస్ఏడబ్ల్యూఐటీ), టీహబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ‘ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఇన్స్టూ డిప్లొయింగ్ జనరేటివ్ ఏఐ మోడల్స్’ అనే అంశంపై సమావేశం జరగనుందన్నారు.
Similar News
News October 16, 2025
రంజీ DAY-2: పడ్డా.. తిరిగి నిలబడ్డ ఢిల్లీ

సొంతగడ్డపై జరుగుతున్న రంజీలో HYD, ఢిల్లీని ఆపలేకపోతోంది. ఓపెనర్ సాంగ్వాన్ 117*, ఆయూష్ దొసేజా 158* సెంచరీలతో అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 256/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ బ్యాటర్లు HYD బైలర్లను ఈజీగా ఎదుర్కొంటున్నారు. 2వ రోజు భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసేలా కనిపిస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత వికట్లు పడగొట్టి HYD నిలువరించగలదేమో చూడాలి. మిలింద్ 2, పున్నయ్ ఒక వికెట్ తీశారు.
News October 16, 2025
మంత్రి సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని మీనాక్షి కాల్

మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. కాసేపట్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటి కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు. మంత్రి సురేఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్య వైరాన్ని తొలగించేందుకు మీనాక్షి నటరాజన్‌తో భేటీ కీలకం కానుంది.
News October 16, 2025
బిగ్ బాస్‌షోపై బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు

ఓ ఛానల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోపై బంజారాహిల్స్ PSలో కమ్మరి శ్రీనివాస్, బి.రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ, యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఫిర్యాదిదారులు అందులో పేర్కొన్నారు.