News June 20, 2024
HYD: ఈనెల 23న రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్

రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ను ఈనెల 23న నిర్వహిస్తున్నట్టు తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్లో అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు జరుగుతాయని, ఆసక్తి గల వారు 7337578899, 7337399299 ఫోన్ నంబర్లకు వాట్సాప్లో తమ వివరాలు పంపించి పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.
Similar News
News October 23, 2025
జూబ్లీహిల్స్లో ప్రచారం.. ప్రతి పైసా లెక్క చెప్పాలి!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థులు ప్రచారం కోసం చేసే ప్రతి పైసాను లెక్కించి అభ్యర్థుల ఖాతాలో జమ చేయాలని వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్లను తనిఖీ చేశారు. అభ్యర్థుల పెయిడ్ న్యూస్పై నిఘా ఉంచాలన్నారు. ర్యాలీలు, సభలు, రోడ్ షోలను రికార్డింగ్ చేయాలన్నారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: 36 మంది నామినేషన్లు రిజెక్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల స్క్రూటీని కొనసాగుతోంది. నిన్న రాత్రి 7 గంటల వరకు 36 మంది అభ్యర్థుల 69 సెట్ల నామినేషన్లు తిరస్కరించారు. 45 మంది నామినేషన్లు ఆమోదించారు. నేడు ఉదయం నుంచి కూడా స్క్రూటినీ జరగనుంది. రేపు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు. INC, BRS, BJP అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదం తెలిపారు.
News October 23, 2025
హైదరాబాద్లో చలి షురైంది!

HYD నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చలి మొదలైంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో చలి నెమ్మదిగా పెరుగుతోంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. పగటి కాలం సంకుచితమై, సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం జరుగుతోంది. ప్రజలు చలి నుంచి రక్షణకు స్వెటర్లు, రగ్గులను సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు ఇప్పటికే చలి నివారణ కోసం మంటలను వెలిగించి కాపుకుంటున్నారు. మరి మీ ఏరియాలో చలి ఎలా ఉంది?