News June 20, 2024

HYD: ఈనెల 23న రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నమెంట్‌

image

రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నమెంట్‌ను ఈనెల 23న నిర్వహిస్తున్నట్టు తెలంగాణ చెస్‌ సంఘం అధ్యక్షుడు ప్రసాద్‌ వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్‌లో అండర్‌-7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు జరుగుతాయని, ఆసక్తి గల వారు 7337578899, 7337399299 ఫోన్‌ నంబర్లకు వాట్సాప్‌లో తమ వివరాలు పంపించి పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.

Similar News

News September 15, 2024

HYDలో రాపిడో రైడర్‌ దారుణహత్య

image

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పంచశీలకాలనీ సమీపంలో కొత్తగూడెంకు చెందిన దినేశ్ దారుణహత్యకు గురయ్యాడు. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. మృతుడు రాపిడో బైక్ రైడర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 15, 2024

HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్‌ ‘వందే భారత్’ ప్రారంభం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.

News September 15, 2024

గణపతి నిమజ్జనానికి A-Z సర్వం సిద్ధం: ఆమ్రపాలి

image

HYD సరూర్‌నగర్‌ చెరువు, జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌, బహదూర్‌పుర మీరాలం, కాప్రా ఊర చెరువులో గణేశ్ నిమజ్జనానికి A-Z సిద్ధం చేసినట్లు GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. 172 రోడ్ల మరమ్మతులు, 36 ట్రాన్స్‌పోర్ట్‌, 140 స్టాటిక్‌ క్రేన్‌లు, 295 మొబైల్‌ క్రేన్స్‌, 160 గణేశ్ యాక్షన్‌ టీమ్స్‌, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 308 మొబైల్‌ టాయిలెట్స్‌, 52,270 తాత్కాలిక స్ట్రీట్‌ లైట్స్‌ సిద్ధం చేసినట్లు చెప్పారు.