News February 10, 2025
HYD: ఈ గేట్లతో.. ఇక క్లియరెన్స్ చాలా ఈజీ..!

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఇక అంతర్జాతీయ ప్రయాణం సులభతరం మారిందని అధికారులు తెలిపారు. ఈ-గేట్లను ఏర్పాటు చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ప్రీ వెరిఫైడ్ ప్రయాణికులకు ఫాస్ట్ క్లియరెన్స్ ఇస్తున్నట్లుగా తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్, ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ ప్రాంతాలకు వలస వెళ్లే వారికి సైతం మేలు కలగనుంది.
Similar News
News December 13, 2025
పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీసు భద్రత

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 1500 మంది పోలీసులతో భద్రతా ఉంటుందని, 1392 పోలింగ్ కేంద్రాల్లో సాధారణ 878, సమస్యాత్మక 179, అతి సమస్యాత్మక 285, మావోయిస్టు ప్రభావిత కేంద్రాలు 50 గుర్తించామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలన్నారు.
News December 13, 2025
దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం

స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లవుతున్నా దేశంలో ఇంకా 40547 గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. ఈ జాబితాలో MPలో 9246, గుజరాత్లో 2443, ఛత్తీస్గఢ్లో 2692, J&Kలో 2262, ఝార్ఖండ్ 2787, కేరళ 2335, WBలో 2748 గ్రామాలున్నాయి. APలో 413, TGలో 173 గ్రామాలకు రోడ్ల లింకేజ్ లేదని కేంద్రం వెల్లడించింది. PMGSY కింద 2029 నాటికి వీటికి రోడ్ల కనెక్టివిటీ చేపడతామని పేర్కొంది. పార్లమెంటులో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
News December 13, 2025
భద్రాద్రి జిల్లాలో రెండో విడతలో ఏకగ్రీవమైన జీపీలు..

భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లో రేపు రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
వివరాలిలా.. అన్నపురెడ్డిపల్లి(M) గుంపెన – ధారబోయిన నరసింహ, ఊటుపల్లి – వాడే వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట(M) మద్దికొండ- తాటి రామకృష్ణ, రామన్నగూడెం- మడకం నాగేశ్వరరావు, ములకలపల్లి(M) పొగళ్లపల్లి – మడకం రవి, చండ్రుగొండ(M) బెండలపాడు-బొర్రా లలిత, మంగయ్య బంజర- మాలోత్ గోపికృష్ణ.


