News February 10, 2025

HYD: ఈ గేట్లతో.. ఇక క్లియరెన్స్ చాలా ఈజీ..!

image

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఇక అంతర్జాతీయ ప్రయాణం సులభతరం మారిందని అధికారులు తెలిపారు. ఈ-గేట్లను ఏర్పాటు చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ప్రీ వెరిఫైడ్ ప్రయాణికులకు ఫాస్ట్ క్లియరెన్స్ ఇస్తున్నట్లుగా తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్, ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ ప్రాంతాలకు వలస వెళ్లే వారికి సైతం మేలు కలగనుంది.

Similar News

News April 14, 2026

ఇప్పుడు రాజకీయంగానూ దెబ్బతింటాం: రేవంత్

image

TG: ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక వివక్ష ఎదుర్కొంటున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ‘బిహార్, UP నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం కంటే వాళ్లు పొందేదే ఎక్కువ. కానీ నా రాష్ట్రం తెలంగాణ పొందే దాని కంటే ఇచ్చేదే ఎక్కువ. ఇప్పుడు LS సీట్లు పెంచితే రాజకీయంగానూ దెబ్బతింటాం. ఎక్కువ జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు సరికాదు’ అని మోదీకి లేఖ రాశారు.

News April 14, 2026

నంద్యాల: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రకు ఏడుగురు విద్యార్థులు

image

ప్రత్యేక ప్రతిభావంతుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను మంగళవారం ఉండవల్లిలో మంత్రి లోకేశ్ ప్రారంభించారు. రాష్ట్రం వ్యాప్తంగా 21 మంది విద్యార్థుల బృందంలో నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు ఏడుగురు ఉండడం విశేషం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాల ప్రోత్సహిస్తామన్నారు.

News April 14, 2026

ఐపీఎల్: SRHలోకి కొత్త ప్లేయర్

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో ఫాస్ట్ బౌలర్ వచ్చారు. గాయంతో టోర్నీకి దూరమైన బ్రైడన్ కార్స్(ENG) స్థానంలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించింది. రూ.75లక్షల ప్రైస్‌తో ఆయన్ను తీసుకుంది. మధుశంక గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. SL తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20ల్లో మొత్తం 70 వికెట్లు పడగొట్టారు.