News March 20, 2024

HYD: ఈ చిన్నారి GREAT

image

HYD చందానగర్‌ వాసి చార్విశ్రీ హుడాకాలనీలోని విద్యావాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. యూట్యూబ్‌లో వీడియో చూసిన చిన్నారి క్యాన్సర్ రోగికి అవసరమయ్యే విగ్ కోసం తన జుట్టు ఇవ్వాలనుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణమూర్తి, మంజూష సహకారంతో 25అంగుళాల పొడవున్న జుట్టును ఇటీవల HYD హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ సంస్థకు అందించింది. ఈవయసులో చిన్నారి ఆలోచన ఆదర్శనీయమని స్థానికులు అభినందించారు.

Similar News

News November 18, 2025

శంషాబాద్‌లో ర్యాగింగ్ కలకలం 2 వర్గాలుగా మారి గొడవ

image

శంషాబాద్‌లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్‌ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

HYD: YCP అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్

image

YCP కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు అయ్యారు. కూకట్‌పల్లిలోని తన ఇంట్లో ఉ.7 గం.కు పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి, ఫోన్లు లాక్కొని అమానుషంగా ప్రవర్తించారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. ప్రస్తుతం తాడిపత్రికి తరలిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.