News March 20, 2024
HYD: ఈ చిన్నారి GREAT
HYD చందానగర్ వాసి చార్విశ్రీ హుడాకాలనీలోని విద్యావాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. యూట్యూబ్‌లో వీడియో చూసిన చిన్నారి క్యాన్సర్ రోగికి అవసరమయ్యే విగ్ కోసం తన జుట్టు ఇవ్వాలనుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణమూర్తి, మంజూష సహకారంతో 25అంగుళాల పొడవున్న జుట్టును ఇటీవల HYD హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ సంస్థకు అందించింది. ఈవయసులో చిన్నారి ఆలోచన ఆదర్శనీయమని స్థానికులు అభినందించారు.
Similar News
News September 14, 2024
HYD నగరంలో DGP పర్యటన
HYD నగర వ్యాప్తంగా డీజీపీ జితేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గణపతి నిమజ్జనానికి చేపడుతున్న ఏర్పాట్లు,బందోబస్తు గూర్చి పరిశీలించారు.చార్మినార్, బాలాపూర్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సిపిలతో కలిసి పరిస్థితులు పరిశీలించారు. నిమజ్జనం, ఊరేగింపు సాఫీగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. పర్యటనలో సీపీలు సుధీర్ బాబు, సివి ఆనంద్, కలెక్టర్ అనుదీప్, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు.
News September 14, 2024
త్వరలో ఉద్యోగుల కోసం ట్రాన్స్‌ఫర్ పాలసీ: బలరాం
రాష్ట్ర సింగరేణి ఉద్యోగులకు CMD బలరాం శుభవార్త చెప్పారు. HYD లక్డీకపూల్ వద్ద ఉన్న సింగరేణి భవన్లో మాట్లాడుతూ.. త్వరలో ఉద్యోగుల కోసం ట్రాన్స్‌ఫర్ పాలసీ తెస్తామన్నారు.బదిలీ, విజ్ఞప్తులను ఆన్ లైన్లో స్వీకరించేందుకు యాప్ రూపొందిస్తామన్నారు. రెండు నెలల్లో సింగరేణిలో ఈ-ఆఫీస్ ప్రారంభిస్తామని, గనుల్లోని కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించారు.
News September 14, 2024
HYD: రెచ్చగొట్టే వారిని అణచివేయండి: మంత్రి
ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.