News February 12, 2025
HYD: ఈ నెల 17వరకు నుమాయిష్ పొడిగింపు

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్ జనవరి 3వ తేదీన ప్రారంభమైంది. నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. సందర్శకులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రత కారణాల దృష్ట్యా మొదటగా ఈనెల 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామని HYD సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల వినతి మేరకు ఈనెల 17 వరకు అనుమతి లభించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.
Similar News
News March 22, 2025
HYD: ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌లో అత్యాచారం

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్‌చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్‌స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్‌కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.
News March 21, 2025
HYD: మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటితొట్లు

మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుమూల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకై జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్లను ఆమె ఇవాళ పరిశీలించారు. డిప్యూటీ వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ రంజిత్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
News March 21, 2025
HYD: ‘విద్యార్థి’ ప్రయాణం ప్రమాదం!

సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం స్టూడెంట్స్ సాహసాలు చేస్తూ కాలేజీలకు వెళుతున్నారు. ప్రమాదపు అంచులో ప్రయాణం ఆందోళన కలిగిస్తోందని నగరవాసులు Way2Newsకు తెలిపారు. అమ్మాయిలూ ఫుట్ బోర్డింగ్ చేస్తున్నారు. ఇక అబ్బాయిల పరిస్థితిని పై ఫొటోలో చూడొచ్చు. BNరెడ్డినగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రూట్ (గుర్రంగూడ)లో ఈ పరిస్థితి ఉంది. ఈ రూట్‌లో బస్సు సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.