News October 15, 2024

HYD: ఈ నెల 22న కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపు

image

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.

Similar News

News July 6, 2025

HYD: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? జాగ్రత్త.!

image

సెకండ్ హ్యాండ్‌లో సెల్ ఫోన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు దొంగిలించిన మొబైళ్లను దుకాణాల్లో అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఇటీవల వనస్థలిపురంలో సెకండ్ హ్యాండ్‌లో ఫోన్ కొని సిమ్ కార్డు వేసిన వెంటనే పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్ తనకు అమ్మారని తెలుసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు. ఇటువంటి విషయంతో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News July 5, 2025

BREAKING: HYD: వికారాబాద్ విహారయాత్రలో మహిళలు మృతి

image

HYD నుంచి విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు మహిళలు శనివారం మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలం సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలోని వెల్డర్‌నెస్ రిసార్ట్‌కు HYDకు చెందిన రీటా కుమారి(55), పూనమ్ సింగ్(56) వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈరోజు సా.5 గంటలకు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తుండగా బోట్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News July 5, 2025

HYD: గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు.. GHMC ఆదేశాలు

image

HYDలో గేటెడ్ కమ్యూనిటీల్లో పోస్టుమాన్‌లకు ప్రవేశం, లిఫ్ట్ అనుమతి, పార్కింగ్ లేకపోవడంతో డెలివరీలకు ఇబ్బందులు తప్పటం లేదు. పోస్ట్‌మాస్టర్ జనరల్ ఫిర్యాదుపై జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు, RWAలు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లిఫ్ట్‌ వినియోగం, పార్కింగ్, లెటర్‌బాక్స్ ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాక.. నివాసితులు ప్రతినిధులను నియమించాలని సూచించింది.