News April 5, 2025

HYD: ఈ బాధ్యతలు జోనల్ కమిషనర్లకు అప్పగింత

image

HYDలో కల్తీ ఆహారం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు రద్దు చేయడం తదితర అధికారాలు GHMC జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు ఉన్న ఈ విధుల్ని GHMC జోనల్ కమిషనర్లకు అప్పగించారు. GHMC పరిధిలోని 30 సర్కిళ్లకు సంబంధించిన అధికారులను ఐదుగురు జోనల్ కమిషనర్లకు అప్పగించారు.

Similar News

News November 18, 2025

తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

News November 18, 2025

సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

image

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 18, 2025

సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

image

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.