News August 16, 2024
HYD: ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు..!

HYD,RR,MDCL,VKB జిల్లాల పరిధిలో ఉన్న గర్భాశయ క్యాన్సర్ నివారించడం చాలా సులువని మేడ్చల్ వైద్య అధికారులు తెలిపారు. క్యాన్సర్ పరీక్షలు చేయించుకుని, క్యాన్సర్కు రెండు అడుగుల దూరంలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా సహా వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రత్యేక పోస్టర్లు ఏర్పాటు చేసే అవగాహన కల్పించారు. పరీక్షల కోసం వాట్సప్ 8411803040, మిస్డ్ కాల్ 1800221951 ఇవ్వాలని సూచించారు.
Similar News
News November 27, 2025
జూబ్లీహిల్స్లో GHMC మోడల్ ఫుట్పాత్

జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ మోడల్ ఫుట్పాత్ ప్రాజెక్టు చేపట్టింది. రీసైకిల్ ప్లాస్టిక్ పేవర్లు, సోలార్ గ్రిడ్, టాక్టైల్ పేవింగ్తో పాదచారుల భద్రతను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫిల్మ్నగర్- బీవీబీ జంక్షన్ మధ్య ఉన్న బీజీ కారిడార్లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, పర్యావరణ హితంగా నిర్మించే ఈ ప్రాజెక్టు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
రంగారెడ్డి డీసీసీ ఆలస్యం ఎందుకు ‘అధ్యక్షా’

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. అయితే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఎందుకు అధ్యక్షా? అని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీసీసీ చీఫ్ పోస్టు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికేతరుడిని నియమిస్తున్నారని తెలియడంతో పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపిక వాయిదా పడిందని సమాచారం.
News November 27, 2025
CUA మహా మాస్టర్ ప్లాన్: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.


