News July 19, 2024

HYD: ఉజ్జయినీ బోనాలు.. కీలక మార్పులు

image

ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 17, 2025

HYD: ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారుల కొరడా

image

రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 72 వాహనాలు సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనచేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉప రవాణాశాఖాధికారి సదానందం ఆదేశాలపై చర్యలు కొనసాగిస్తున్నారు.

News November 17, 2025

HYD: iBOMMA రవి అరెస్ట్‌పై సీపీ ప్రెస్‌మీట్

image

iBOMMA రవి అరెస్ట్‌పై నేడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ పోలీసులు బ్లాక్ చేశారు. ‘ఐబొమ్మ’ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్‌లు ప్రమోట్ చేసి రవి రూ.కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

News November 17, 2025

HYD: GOOD NEWS 45 రోజులు ఫ్రీ ట్రెయినింగ్

image

మేడ్చల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ట్రెయినింగ్ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో బ్యాచ్‌లో 30 మందిని ఎంపికచేసి 45 రోజులపాటు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. దీంతో యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించే అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. శామీర్‌పేట పాత GP భవనంలో NCP కేంద్రం ఏర్పాటు చేయగా, దీనికి రూ.60లక్షలు విడుదల చేశారు. మరిన్ని వివరాలకు కేంద్రాన్ని సంప్రదించండి.