News July 21, 2024
HYD: ‘ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలు చేయాలి’

ఈనెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఫోరం రాష్ట్ర ఛైర్మన్ చీమ శ్రీనివాస్ బషీర్‌బాగ్‌లో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలన్నారు.
Similar News
News November 27, 2025
HYD: విషాదం..11 ఏళ్లకే సూసైడ్

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాలుడు(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.
News November 27, 2025
HYD: FREEగా వెళ్లొద్దాం రండి!

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.
News November 27, 2025
అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ఇంజినీరింగ్ విభాగం వీటిని తయారుచేసింది.


