News August 19, 2024
HYD: ఉద్యోగం అంటూ.. డబ్బు డిమాండ్ చేశారా?

ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఆన్లైన్లో నకిలీ ఉద్యోగ సంస్థల వలలో చిక్కి మోసపోవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ‘X’ వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టబద్ధమైన సంస్థలు ఉద్యోగ ఆఫర్ కోసం అభ్యర్థుల నుంచి డబ్బు అడగవని, ఎవరైనా డబ్బులు అడిగితే మోసమని గుర్తించాలన్నారు. ఫిర్యాదుల కోసం 1930కి లేదా డయల్ 100కి కాల్ చేయాలన్నారు.
Similar News
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
News November 19, 2025
సా.4 గంటల వరకు సచివాలయ ఉద్యోగులకు వైద్యశిబిరం

రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉ.11 గంటలకు ప్రారంభమయ్యే శిబిరం సా.4 గంటల వరకు ఉంటుందన్నారు. నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందిస్తారని.. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
News November 19, 2025
ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. పాలక మండలి పదవీ కాలం కేవలం 2 నెలలు మాత్రమే ఉండటంతో పలు నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుందని సమాచారం. తమ డివిజన్లలో సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేసే అవకాశముంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ అధిక నిధులు విడుదల చేశారని.. తమకు కూడా విడుదల చేయాలని కోరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


