News August 19, 2024
HYD: ఉద్యోగం అంటూ.. డబ్బు డిమాండ్ చేశారా?

ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఆన్లైన్‌లో నకిలీ ఉద్యోగ సంస్థల వలలో చిక్కి మోసపోవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ‘X’ వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టబద్ధమైన సంస్థలు ఉద్యోగ ఆఫర్ కోసం అభ్యర్థుల నుంచి డబ్బు అడగవని, ఎవరైనా డబ్బులు అడిగితే మోసమని గుర్తించాలన్నారు. ఫిర్యాదుల కోసం 1930కి లేదా డయల్ 100కి కాల్ చేయాలన్నారు.
Similar News
News July 10, 2025
ఘట్‌కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.
News July 10, 2025
హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం

హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిన్నటి వరకు ఐదుగురు మృతిచెందగా.. 31 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూకట్‌పల్లి PS పరిధిలోని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించిన కెమికల్స్ కలిపిన కల్లు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్ అధికారులు 5 కేసులు నమోదు చేశారు. కాగా కల్లు దుకాణాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో విమర్శలు వస్తున్నాయి.
News July 10, 2025
వైభవంగా చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.