News January 13, 2025
HYD: ఉద్యోగులు 2వ, 4వ సండే సమస్యలు చెప్పొచ్చు

ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారాన్ని చూపేందుకు ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టినట్టు ఆ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. ఈనెల 24న తొలి సమావేశానికి మంత్రి సీతక్క హాజరు కానున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ అంశాల పరిష్కారానికి ప్రతి నెల రెండో, నాలుగో ఆదివారాల్లో మధ్యాహ్నం 3గం.- 4గం. వరకు ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం ఉండనుంది.
Similar News
News February 7, 2025
HYD: దారుణం.. మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. మేడ్చల్ పోలీసుల వివరాలు.. ఓ కేసు కోసం PSకు వచ్చిన మహిళ(31)తో PC సుధాకర్ రెడ్డి పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిచి పలుమార్లు అత్యాచారం చేశాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. చివరకు దాడి చేయించడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. CP ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
News February 6, 2025
వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఏ సోషియాలజీ (ఇంటర్నల్), ఎంఏ సోషియాలజీ (నాన్ ఇంటర్నల్), డేటా సైన్స్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
News February 6, 2025
HYD: రేవంత్ చిత్రపటాలు తగలబెట్టాలి: రామచంద్రరావు

కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషను విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు.