News March 2, 2025
HYD: ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఆయన పర్యటనలో పాల్గొనేందుకు అధికారులంతా సిద్ధమయ్యారు. ఉపరాష్ట్రపతికి సన్మానం చేసిన మంత్రి, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రమంత్రి సహకారం కోరారు. అనంతరం ధన్‌ఖడ్ పలువురు నేతలతో భేటీ కానున్నారు.
Similar News
News October 16, 2025
మంత్రి సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని మీనాక్షి కాల్

మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. కాసేపట్లో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటి కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు. మంత్రి సురేఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్య వైరాన్ని తొలగించేందుకు మీనాక్షి నటరాజన్‌తో భేటీ కీలకం కానుంది.
News October 16, 2025
బిగ్ బాస్‌షోపై బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు

ఓ ఛానల్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోపై బంజారాహిల్స్ PSలో కమ్మరి శ్రీనివాస్, బి.రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ, యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఫిర్యాదిదారులు అందులో పేర్కొన్నారు.
News October 16, 2025
మంత్రుల వ్యవహారంపై ఇన్‌ఛార్జి నటరాజన్ సీరియస్

మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి నటరాజన్ సీరియస్ అయ్యారు. మంత్రుల మధ్య వరుస విభేదాలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఆమె ఆరా తీశారు. సీఎం, మంత్రులపై కొండా సురేఖల కుమార్తె సుష్మిత చేసిన కామెంట్స్ ఎందుకు చేశారనే దానిపై ఇన్‌ఛార్జి ఆరా తీశారు.