News February 27, 2025

HYD: ఉపాధ్యాయుడి వేధింపులు.. రిమాండ్

image

ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదర్‌గుల్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News March 24, 2025

చార్మినార్: పాతబస్తీలో పార్కింగ్‌కు నో పరేషాన్ !

image

రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సిటీ కాలేజీ, కులీ కుతుబ్ షా స్టేడియం, ఖిల్వంత్ గ్రౌండ్, మోతీగల్లీ ఓల్డ్ పెన్షన్ ఆఫీస్ ప్రాంతం, ముఫీద్ ఉల్ ఆనం గ్రౌండ్, చార్మినర్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునాని ఆస్పత్రి ప్రాంగణం ప్రాంతాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు.

News March 24, 2025

సచివాలయానికి వెళ్లాలంటే ఫోన్లు డిపాజిట్ చేయాల్సిందే !

image

సచివాలయం ప్రజా ప్రభుత్వానికి చిహ్నమని, ఎవరైనా నిరభ్యంతరంగా రావచ్చని అప్పట్లో CM రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కాగా ఇటీవల సచివాలయంలో ఏర్పడిన పరిమితులపై ప్రజల నుంచి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ప్రజలు, ప్రతినిధులు, మీడియా స్వేచ్ఛగా సచివాలయంలోకి రావచ్చని చెప్పిన ప్రభుత్వ విధానం ఇప్పుడు విరుద్ధమైందని విమర్శలు వస్తున్నాయి. సచివాలయంలోకి వెళ్లే వారు తమ ఫోన్లను డిపాజిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News March 24, 2025

HYD: సైబర్ నేరగాలపై టీజీసీఎస్బీ కీలక సూచన

image

HYD: కార్పొరెట్ కంపెనీల్లో అన్‌లైన్ చెల్లింపులపై జాగ్రత్త వహించాలని టీజీసీఎస్బీ శిఖా గోయల్ తెలిపారు. గోయల్ మాట్లాడుతూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాల్స్ వచ్చినట్లు అనిపిస్తే లావాదేవీలు చేసే ముందు ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ ద్వారా ధృవీకరించుకుని చెల్లింపులు చేయాలని సూచించారు. ఇటీవల ఓ కంపెనీ ఎండీ పేరుతో అకౌటెంట్‌కి సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారని పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్సర్ చేశారన్నారు.

error: Content is protected !!