News February 27, 2025

HYD: ఉపాధ్యాయుడి వేధింపులు.. రిమాండ్

image

ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదర్‌గుల్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News February 24, 2026

‘ది కేరళ స్టోరీ-2’ టీజర్‌ను వెనక్కి తీసుకుంటాం: మేకర్స్

image

వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ-2’ టీజర్‌ను వెనక్కి తీసుకుంటామని కేరళ హైకోర్టుకు మేకర్స్ తెలిపారు. ఈ మూవీ మతవిద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ HCలో విచారణ జరిగింది. కేరళ సెక్యులర్ రాష్ట్రమని, కొన్ని ఘటనలను చూపి స్టేట్ మొత్తం ఇలాగే ఉందనడం సరికాదని HC అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపైనా CBFCని నిలదీసింది.

News February 24, 2026

భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకం: వనపర్తి కలెక్టర్

image

రాబోయే రోజుల్లో ప్రజల భూసమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని,కాబట్టి నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగా,పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.మంగళవారం జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భూవివాదాల పరిష్కారంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పనిచేయాలన్నారు.

News February 24, 2026

HYD: గాంధీ విగ్రహం వద్దని గాంధీ మునిమనవడి ట్వీట్

image

మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం కోసం ప్రజలను తరలించడం అత్యంత అగాంధేయ చర్య అని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అన్నారు. ఇళ్లను కూల్చి స్థలం కల్పించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బాపు ఉండి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయొద్దు’ అని చెప్పేవారని తుషార్ గాంధీ Xలో ట్వీట్ చేశారు.