News April 9, 2024

HYD: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 1,66,475 దరఖాస్తులు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 1,66,475 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం.రాధారెడ్డి HYDలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు బుధవారం వరకే ఉందని తెలిపారు. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాతపరీక్షలను ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

Similar News

News April 21, 2025

HYD: TGSRTCలో జాబ్స్‌.. ప్రిపరేషన్‌కు READY

image

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో HYD, RR, MDCL జిల్లాలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.

News April 21, 2025

HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News April 21, 2025

HYD: అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.

error: Content is protected !!