News April 11, 2024
HYD, ఉమ్మడి RRలో రంజాన్ సందడి

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని HYD, ఉమ్మడి RR జిల్లాలోని పలు పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు.. రాత్రంతా షాపులను తెరిచి ఉంచారు. వస్త్రాలు,మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, గృహ పరికరాలతో పాటు సేమియాలు, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది.
Similar News
News March 20, 2025
హైదరాబాద్‌లో OYO 2.O!

HYDలో OYOకు డిమాండ్ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది
News March 20, 2025
HYDలో విశ్వ సుందరి సందడి!

మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా నగరంలో నేడు సందడి చేయనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరుకానున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించనున్నారు. మంగళవారం ఆమె చీరకట్టులో యాదాద్రి స్వామిని దర్శించుకొన్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
News March 20, 2025
HYD: ఓయూ బంద్‌కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.