News February 25, 2025
HYD: ఉష్ణోగ్రతలు పెరుగుతాయి జాగ్రత్త: కలెక్టర్

వేసవిలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి జాగ్రత్తలు చెప్పారు. కలెక్టరేట్లో ఎండల తీవ్రత, జాగ్రత్త చర్యలపై జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.
Similar News
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఈ లక్షణాలతో గుర్తించండి

వాతావరణ మార్పుల కారణంగా కొన్నిచోట్ల మిరపలో జెమిని వైరస్ కనిపిస్తోంది. ఇది ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చగా మారుతాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీనికి తోడు కొన్నిచోట్ల పచ్చదోమ కూడా కనిపిస్తోంది. దీని వల్ల మొక్క పెరుగుదల, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఎలా నివారించాలి?

జెమిని వైరస్ నివారణకు ముందుజాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించాలి. వ్యాధిసోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తీసివేయాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుంచి 10 అమర్చితే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. జెమిని వైరస్ నివారణకు లీటరు నీటికి పైరిప్రాక్సిపెన్ 1.5ml లేదా పైరిప్రాక్సిపెన్ + ఫెన్ప్రోపాత్రిన్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
తిరుమల పరకామణి కేసు.. భూమనకు నోటీసులు

AP: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.


