News February 14, 2025
HYD: ఎండాకాలం.. సోడా బండి కష్టాలు..!

ఎండాకాలం సోడా బండి కష్టాలు వర్ణనాతీతం. ఓవైపు భగభగ మండే ఎండ, ఇంకోవైపు పూట గడవాలంటే కష్టపడక తప్పని పరిస్థితి. రోడ్డుపై సోడా బండి లాగుతూ ఓ వ్యక్తి పడుతున్న కష్టాన్ని ఓ ఫొటోగ్రాఫర్ బాలానగర్ ప్రాంతంలో క్లిక్ చేశాడు. కుటుంబ బండిని ముందుకు నడిపించేందుకు సోడాబండిపై ఎంతో దూరం నుంచి HYD వస్తుంటారని తెలిపారు. చెమటోడ్చి కష్టపడుతూ.. సోడాతో దాహార్తి తీర్చే వారికి ఈ ఆర్టికల్ అంకితం.
Similar News
News December 17, 2025
కడప: శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్ అందజేత

మహిళల వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన మన కడప జిల్లా మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత చెక్కును మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉండవల్లిలో బుధవారం ఆమె అందుకున్నారు. కడపలో ఇంటి స్థలం, గ్రేడ్ వన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఆమెకు ఇవ్వనున్న విషయం తెలిసిందే.
News December 17, 2025
వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
NRPT: మూడో విడత.. @1 గంట వరకు పోలింగ్ శాతం

జిల్లాలో 3వ విడత GPఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ వివరాలను అధికారులు విడుదల చేశారు. జిల్లాలోని కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్ మండలాల్లో మొత్తం 1,52,648 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 1 గంట వరకు 1,22,307 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.12% నమోదు అయింది. కృష్ణలో 78.18%, మాగనూర్లో 84.17%, మక్తల్లో 81.76%, నర్వలో 88.35%, ఊట్కూర్లో 72.42 శాతం.


