News April 6, 2024
HYD: ఎండ మామూలుగా లేదుగా!

HYDలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా కూకట్పల్లిలోని వివేకానందనగర్ ఆఫీస్ వద్ద 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మల్లాపూర్- 43 డిగ్రీలు, కుత్బుల్లాపూర్-42.7, గోల్కొండ, లంగర్ హౌస్, చర్లపల్లిలో-42.6, ముషీరాబాద్-42.3తో పాటు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రజలు అవసరమైతే బయటకు రావాలని సూచించింది.
Similar News
News November 20, 2025
HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.
News November 20, 2025
HYD: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికల ముందే పోలీస్ శాఖలోని 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి ఆకాశ్ డిమాండ్ చేశారు. ఈరోజు సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను విస్మరించిందన్నారు. జీవో నంబర్ 46ను పూర్తిగా రద్దుచేసి, స్థానిక సంస్థల ఎన్నికలలోపు JOB నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు.


