News April 6, 2024

HYD: ఎండ మామూలుగా లేదుగా!

image

HYDలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ ఆఫీస్ వద్ద 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మల్లాపూర్- 43 డిగ్రీలు, కుత్బుల్లాపూర్-42.7, గోల్కొండ, లంగర్ హౌస్, చర్లపల్లిలో-42.6, ముషీరాబాద్-42.3తో పాటు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రజలు అవసరమైతే బయటకు రావాలని సూచించింది.

Similar News

News January 17, 2025

HYD: కేటీఆర్ వ్యాఖ్యలతో సానుభూతి పోతోంది: అద్దంకి 

image

కేటీఆర్ వ్యాఖ్యలతో ఆయన మీదున్న సానుభూతి పోతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఫార్ములా ఈరేస్ కేసులో ఈడీ, ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించడం లేదన్నారు. విచారణ సంస్థల్ని ఆయన టెస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి సహకరించడం కేటీఆర్ విధి అని గుర్తుచేశారు. 

News January 17, 2025

HYD: బ్రిజేష్  ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం స్వాగతిస్తోంది: మంత్రి 

image

బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ ఎన్.బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందని తెలిపారు. 

News January 16, 2025

ఇబ్రహీంపట్నంలో దారుణం.. యువతిపై అత్యాచారం

image

HYD శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్‌పై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాలు.. మంగళ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే భవనంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేసే డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.