News April 30, 2024

HYD: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!

image

MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మల్కాజిగిరిలో 37 నామినేషన్లు ఆమోదించగా.. 15 మంది విత్‌డ్రా చేసుకొన్నారు. 22 మంది బరిలో నిలిచారు. HYD లోక్‌సభలో 8 మంది విత్‌ డ్రా చేసుకోగా.. 30 మంది బరిలో ఉన్నారు. చేవెళ్లలో 46 మందికి ముగ్గురు ఉససంహరించుకొన్నారు. 43 మంది పోటీలో నిలిచారు. ఇక సికింద్రాబాద్‌లో ఒక్కరే నామినేషన్ ఉపసంహరించుకొన్నారు. ఇక్కడ 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. SHARE IT

Similar News

News November 12, 2024

HYD: డీసీఏ అధికారులతో మంత్రి సమావేశం

image

నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు‌. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు.

News November 12, 2024

HYD: 15 వేల మంది విద్యార్థులతో ప్రోగ్రాం: సీఎం

image

HYDలో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు దాదాపుగా 15,000 మంది విద్యార్థులతో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల ప్రాజెక్టును ప్రకటించడంతో పాటు, పూర్తి వివరాలు వివరించనున్నట్లు సెక్రటేరియట్లో పేర్కొన్నారు. 20-25 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థుల కెపాసిటీతో గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

News November 12, 2024

HYD: ‘కుల సర్వేలో ఎస్సీ మాదిగ 31ను మెన్షన్ చేయండి’

image

కుల సర్వేలో ఎస్సీ మాదిగ 31ను మెన్షన్ చేయాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ అన్నారు. ఎన్యూమరేటర్లు సర్వే వివరాలు నింపుతున్న ఫామ్‌లో ఎస్సీ మాదిగ అని మెన్షన్ చేస్తూ, మాదిగ కోడ్ 31గా నమోదు చేసుకోవాలని తెలిపారు. కోడ్‌ను నమోదు చేయని పక్షంలో మాదిగ కులాన్ని జనాభా లెక్కలు తక్కువ చూపిస్తూ, రావాల్సిన రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని, దీన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.