News May 20, 2024
HYD: ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
తెలుగు హీరో ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Similar News
News December 11, 2024
HYD: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరో మలుపు!
పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చిందన్నారు. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదని, ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారన్నారు. అయినా తమ బాధ్యతగా బందోబస్తు కల్పించామని, అలాంటి తమపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
News December 11, 2024
HYD: RTC బస్సు డిపోలన్నీ ప్రైవేటుపరం..?
సిటీలో ఎయిర్ పొల్యుషన్‌ను తగ్గించేందుకు డిజిల్ బస్సులను నగరం వెలుపలకి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో RTC ప్రైవేటీకరణ మొదలైందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని భావిస్తున్న సంస్థ.. ముందడుగు వేసింది. కండక్టర్ సేవలు మినహా మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేట్ సంస్థలకే అప్పగించే ఛాన్సుంది. దీంతో సిటీ బస్సు డిపోలన్నీ ప్రైవేట్‌పరం కానున్నట్లు టాక్.
News December 11, 2024
చీకట్లో హైదరాబాద్ అందాలు!
ట్యాంక్‌బండ్‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. అనుగుణంగా HMDA, GHMC అధికారులు బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. తాజాగా HYDలో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించిన ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ చుట్టూ LED లైట్లను ఏర్పాటు చేసింది. త్రివర్ణ లైట్లతో తెలంగాణ సెక్రటేరియట్ వెలిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోను HMDA ‘X’లో పోస్ట్ చేసింది. చీకట్లో బిర్లా టెంపుల్, సెక్రటేరియట్ ఫొటో అందరినీ ఆకర్శిస్తోంది.