News May 20, 2024
HYD: ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
హీరో ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Similar News
News December 4, 2024
HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు
55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.
SHARE IT
News December 4, 2024
HYDలో ‘పుష్ప 2’ విడుదలయ్యే థియేటర్ల LIST!
సింగిల్ స్క్రీన్స్: సంధ్య 70, సంధ్య 35, సుదర్శన్ 35, దేవి 70-RTC X రోడ్స్, తారకరామ 70-కాచిగూడ, శాంతి 70-నారాయణగూడ, అంజలి 70, ప్రశాంత్ 70-సికింద్రాబాద్, శ్రీరమణ-అంబర్‌పేట, ఆరాధన AC-తార్నాక, గోకుల్ 70-ఎర్రగడ్డ, విజేత 70-బోరబండ, VLS శ్రీదేవి-చిలకలగూడ.
మల్టీప్లెక్స్: AMB, ప్రసాద్, PVR, Cinepolis, INOX, ASIAN, AAA, సినీప్లానెట్‌తో పాటు తదితర మల్టీ స్క్రీన్‌లలో సినిమా విడుదల చేస్తున్నారు.
SHARE IT
News December 4, 2024
HYD: రేపు డెక్కన్ ఎరీనాలో హోరాహోరీ మ్యాచ్
అజీజ్‌నగర్‌లో ఐ – లీగ్ (ఫుట్ బాల్) పోటీలు జరగనున్నాయి. డెక్కన్ ఎరీనాలో రేపు (గురువారం) రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనుంది. హైదరాబాద్ తరఫున శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనున్న నేపథ్యంలో మ్యాచ్‌కి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.