News May 12, 2024
HYD: ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు: సీపీ

శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. HYD నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందించామని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
21న పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం రేవంత్: డీజీపీ

అక్టోబర్ 21 గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని డీజీపీ శివధర్ తెలిపారు. కార్యక్రమం ఉ.9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 21- 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
News October 20, 2025
HYD సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్& డ్రైవ్ తనిఖీలు

హైదరాబాద్ సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్& డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ కేసులపై కఠిన చర్యలు చేపట్టారు. 212 మంది డ్రంక్& డ్రైవ్ నిందితులకు ₹6.79 లక్షల జరిమానా, 25 మందికి నాంపల్లి కోర్టు జైలుశిక్ష విధించింది. సెల్ఫోన్ డ్రైవింగ్పై ₹1.61 లక్షలు, మైనర్ డ్రైవింగ్పై ₹14,700 జరిమానా విధించారు. ట్రాఫిక్ భద్రతకు ప్రజలు కట్టుబడి ఉండాలని పోలీసులు సూచించారు.
News October 20, 2025
HYD: ట్రేడింగ్ మోసగాడు సుల్తాన్ అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ మోసాల్లో పాల్గొన్న కందుకూరు సుల్తాన్ అహ్మద్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఈయన నకిలీ బ్యాంక్ ఖాతాలను కమిషన్ మీద అందించి దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు తోడ్పడ్డాడు. సుమారు ₹3 కోట్లు మోసం చేసినట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా 15కేసులు నమోదయ్యాయి. మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకుని బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు.