News April 18, 2024

HYD: ఎన్నికలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీల్లో రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ.2,00,13,088 విలువైన ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 185 మందిపై కేసులు నమోదు చేయగా, 181 మందిని అరెస్టు చేసినట్లు రోనాల్డ్ రాస్ వివరించారు.

Similar News

News December 16, 2025

GHMC డీలిమిటేషన్‌.. నేడు స్పెషల్‌ కౌన్సిల్‌ మీట్

image

GHMC డీలిమిటేషన్‌‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఎవరిని సంప్రదించి వార్డులు పెంచారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వాలని GHMC వారం రోజుల గడువు ఇవ్వగా వెయ్యికిపైగా ఆబ్లిగేషన్స్ వచ్చాయి. వీటిపై చర్చించేందుకు నేడు బల్దియా స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు పాలకవర్గం సమాధానం ఇవ్వనుంది. ఫైనల్‌ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

News December 15, 2025

HYDలో సీక్రెట్‌గా ‘హుష్-డేటింగ్’

image

HYDలో ప్రస్తుతం ‘హుష్-డేటింగ్’ అనే కొత్త సీక్రెట్ ట్రెండ్ మామూలుగా లేదు. పేరెంట్స్ నిఘా, ఒత్తిడి ఎక్కువైపోవడంతో ఇక్కడి యువతీ యువకులు ఆన్‌లైన్‌ డేటింగ్ కోసం గోప్యంగా ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా గ్రూప్ చాట్స్‌లో మాత్రమే గుసగుసలాడుకుంటున్నారు. వీళ్లు కలిసే చోట్ల కూడా ఒక లెక్క ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్ పబ్లిక్ కాఫీ షాప్‌ల వంటి దూరం ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.