News April 18, 2024
HYD: ఎన్నికలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీల్లో రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ.2,00,13,088 విలువైన ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 185 మందిపై కేసులు నమోదు చేయగా, 181 మందిని అరెస్టు చేసినట్లు రోనాల్డ్ రాస్ వివరించారు.
Similar News
News September 14, 2024
HYD: రెచ్చగొట్టే వారిని అణచివేయండి: మంత్రి
ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.
News September 14, 2024
నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు
నిమ్స్‌లో ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు నిమ్స్‌లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 14, 2024
గవర్నర్ వద్దకు వెళ్లిన సికింద్రాబాద్ ADRM
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ వెళ్లారు. గవర్నర్ పిలుపు మేరకు వెళ్లిన అధికారి, రైల్వే అభివృద్ధి, ఇతర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రైల్వే సేఫ్టీపై తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ వారికి సూచించారు.