News May 4, 2024
HYD: ‘ఎన్నికల తర్వాత మెట్రో రెండో దశ పనులు’

లోక్‌సభ ఎన్నికల అనంతరం మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కార్యాచరణ చేపట్టనున్నట్లు HYD మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి తెలిపారు. రెండో దశపై ఇప్పటికే DPRను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత కేబినెట్ అనుమతి కోసం DPRను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో మెట్రో రెండో దశ పనులు ప్రారంభమవుతాయన్నారు. LB నగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
Similar News
News January 21, 2026
హైదరాబాద్ GEN-Zలో ట్రాన్స్‌ఫార్మేషన్

మన నగర కుర్రాళ్లు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. దీంతో ‘రెట్రో’ స్టైల్స్, లో-రైజ్ జీన్స్, ఆ ఫ్లిప్ ఫోన్ల సౌండ్ మళ్లీ వినబడుతోంది. హైటెక్ సిటీ పాప్-అప్‌లలో కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు తింటూ, విదేశీ మాక్‌టైల్స్ సిప్ చేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం లోకల్ బజార్లలో దొరికే బట్టలనే ఫెంటాస్టిక్ మోడల్స్‌లా డిజైన్ చేసి, నెట్టింట్లో పెడుతున్నారు. ఇలా ట్రాన్స్‌ఫార్మేషన్ రీల్స్ పిచ్చెక్కిస్తున్నాయి.
News January 20, 2026
HYDలో అమ్మాయిలు భయపడకండి!

సిటీలో పోకిరీల ఆటలు సాగనివ్వమని ‘షీ టీమ్స్’ మరోసారి ప్రూవ్ చేశాయి. కేవలం వాట్సాప్ టిప్స్‌తో డిసెంబర్‌లో 13 మందిని పట్టుకుంటే, జనవరి నాటికి ఆ జోరు మరింత పెరిగింది. సైబరాబాద్‌లో 127 డెకాయ్ ఆపరేషన్లతో ఏకంగా 59 మంది వేధింపుల రాయుళ్లను జైలుకు పంపారు. ఇదే గ్యాప్‌లో యువత ఫెర్టిలిటీ అవేర్‌నెస్, ఒంటరితనంపై కూడా ‘రియల్ టాక్’ మొదలుపెట్టింది. వేధింపులు ఉంటే 9490616555కు ఫిర్యాదు చేయండి. భయం అస్సలు వద్దు!
News January 20, 2026
HYD: ట్రాఫిక్ పోలీసుల సేఫ్టీ.. స్టైలిష్ లుక్!

రోడ్లపై నిలబడి ఎండ, ధూళితో కుస్తీ పట్టే మన ట్రాఫిక్ అన్నలకు ఇప్పుడు అదిరిపోయే రక్షణ దొరికింది. సైబరాబాద్ జాయింట్ CP గజరావు భూపాల్ చేతుల మీదుగా సిబ్బందికి స్పెషల్ గాగుల్స్ పంపిణీ చేశారు. ఎండ వేడిమి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకుంటేనే, పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులు హెల్తీగా, స్టైలిష్‌గా డ్యూటీ చేయబోతున్నారు.


