News February 13, 2025
HYD: ఎమ్మెల్సీకి నోటీసులు జారీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తోల్కట్ట ఫామ్ హౌస్‌లో కోడిపందేల నిర్వహణ కేసులో నోటీసులు అందజేసినట్లు అధికారుల సమాచారం. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో కోడిపందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు.
Similar News
News March 23, 2025
SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.
News March 23, 2025
గోల్కొండ: బావికి పూర్వ వైభవం తెస్తే సూపర్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గోల్కొండ కోట బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా ప్రసిద్ధిగాంచింది. ఈ క్రమంలో ప్రతిరోజు ఎంతోమంది టూరిస్టులు, నగరవాసులు గోల్కొండ కోటను సందర్శింస్తుంటారు. అయితే గోల్కొండ కోటలో పురాతన బావి ఉంది. ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోయాయి. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి బావి పునరుద్ధరించాలని పర్యటకులు కోరుతున్నారు. బావికి పూర్వ వైభవం తెస్తే బాగుంటుందన్నారు.
News March 23, 2025
HYD: ‘నెట్ వర్కింగ్‌ను సద్వినియోగం చేసుకోండి’

యువత నెట్ వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏఐ డేటా ఫెస్ట్ ప్రతినిధి, ప్రముఖ పారిశ్రామిక డేటా నిపుణులు ధావల్ పటేల్ సూచించారు. ఏఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో శనివారం నారాయణగూడలో విద్యార్థులకు, యువతకు నెట్ వర్కింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఐ డేటా సైన్స్ అనలిటిక్స్‌లో పురోగతులను పరిశోధించడానికి మంచి ఫ్లాట్ ఫారం లా ఇలాంటి వర్క్ షాపులు దోహద పడతాయన్నారు.