News December 3, 2024
HYD: ఎమ్మెల్సీతో మరో ఎమ్మెల్సీ భేటీ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. HYDలో ఎమ్మెల్సీ కవితను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఉమ్మడి పాలమూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను తనదైన శైలిలో తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్న ఆయనని.. ఎమ్మెల్సీ కవిత అభినందించారు. అనంతరం పార్టీ విషయాలు, ప్రజా సమస్యలను పరస్పరం చర్చించుకున్నారు.
Similar News
News January 24, 2025
హైదరాబాద్‌లో చికెన్ ధరలు
హైదరాబాద్‌లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్‌లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149గా నిర్ణయించారు. మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT
News January 23, 2025
డిజిటల్ భద్రత కోసం రాచకొండ పోలీసుల సూచనలు
డిజిటల్ గుర్తింపును రక్షించుకోవడం అత్యంత ప్రాముఖ్యమని రాచకొండ పోలీసులు సూచించారు. బయోమెట్రిక్ OR 2FA వంటి 2తరగతుల భద్రతను ఉపయోగించి అకౌంట్లను రక్షించుకోవాలన్నారు. ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌లు సృష్టించాలని తెలిపారు. మీ డిజిటల్ హెల్త్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. గూగుల్‌లో మీ వివరాలను చెక్ చేసి, ఉపయోగించని అకౌంట్లను తొలగించాలని(OR)1930లో సంప్రదించాలన్నారు.
News January 23, 2025
HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ
గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT