News January 23, 2025

HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ

image

గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT

Similar News

News February 16, 2025

CT-2025.. భారత్ మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టికెట్లు

image

భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ICC గుడ్ న్యూస్ చెప్పింది. CTలో భాగంగా దుబాయ్‌లో IND ఆడే గ్రూప్, తొలి సెమీస్ మ్యాచ్‌లకు అదనపు టికెట్లను ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. హైబ్రిడ్ విధానంలో CT జరుగుతున్నందున ఫైనల్ మ్యాచ్ టికెట్లు రిలీజ్ చేయలేదు. భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ దుబాయ్‌లో, లేకపోతే లాహోర్‌లో జరుగుతుంది. గ్రూప్ స్టేజీలో IND 20న బంగ్లాతో, 23న పాక్‌తో, మార్చి 2న NZతో తలపడనుంది.

News February 16, 2025

వాజేడు: విద్యార్థి మృతి.. తల్లిదండ్రుల రోదన  

image

జ్వరంతో విద్యార్థి మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వినీత్(14) మంగళవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో విద్యార్థిని 2రోజులు సెలవులకు హాస్టల్ సిబ్బంది ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం రావడంతో ఏటూరునాగారం తరలిస్తుండగా మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.   

News February 16, 2025

నిజాంసాగర్: ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా నోడల్ అధికారి

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను, కళాశాలను ఆదివారం కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి సలాం సందర్శించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షను ఆయన పర్యవేక్షించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

error: Content is protected !!