News January 23, 2025

HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ

image

గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT

Similar News

News February 8, 2025

అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

image

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

News February 8, 2025

HYD: ఢిల్లీలో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్‌‌రావు

image

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘం అన్నారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని విమర్శించారు.

News February 8, 2025

GHMC వాటర్ బోర్డ్ వెబ్‌సైట్ మొరాయింపు

image

HYD మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్‌ బుకింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. బిల్లుల చెల్లింపులూ జరగలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల క్రితం వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ సర్వర్‌‌ హ్యాక్‌ అయ్యిందని సాంకేతిక సమస్యలు తలెత్తగా, తాజాగా వాటర్‌బోర్డు సర్వర్‌ మొరాయించడంతో వెబ్‌సైట్‌ పని చేయలేదు.

error: Content is protected !!