News May 3, 2024
HYD: ఎర్రకుంటలో మృతదేహం లభ్యం

ఎర్రకుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం చెత్తను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 3, 2025
HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.
News November 3, 2025
మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.
News November 3, 2025
HYD: ఘోరం.. ఉలిక్కపడ్డ మీర్జాగూడ

RTC బస్సు ప్రమాద ఘటనతో మీర్జాగూడ ఉలిక్కిపడింది. ఉ.6 గంటల వరకు అంతా ప్రశాంతంగా ఉంది. హైవే మీద ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, బెస్తపూర్, ఖానాపూర్, కిష్టపూర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళనతో కొందరు యువకులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే రోడ్ల మీద మృతులు, కంకర కింద క్షతగాత్రులను చూసి చలించిపోయారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు.


