News December 26, 2024

HYD: ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను ఖండించిన KTR

image

BRS రాష్ట్ర నేత <<14984793>>ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను<<>> పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. BRS పార్టీకి కేసులేమి కొత్త కాదన్నారు.

Similar News

News October 16, 2025

మంత్రి సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని మీనాక్షి కాల్

image

మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. కాసేపట్లో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటి కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు. మంత్రి సురేఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్య వైరాన్ని తొలగించేందుకు మీనాక్షి నటరాజన్‌తో భేటీ కీలకం కానుంది.

News October 16, 2025

బిగ్ బాస్‌షోపై బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు

image

ఓ ఛానల్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోపై బంజారాహిల్స్ PSలో కమ్మరి శ్రీనివాస్, బి.రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ, యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఫిర్యాదిదారులు అందులో పేర్కొన్నారు.

News October 16, 2025

మంత్రుల వ్యవహారంపై ఇన్‌ఛార్జి నటరాజన్ సీరియస్

image

మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి నటరాజన్ సీరియస్ అయ్యారు. మంత్రుల మధ్య వరుస విభేదాలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఆమె ఆరా తీశారు. సీఎం, మంత్రులపై కొండా సురేఖల కుమార్తె సుష్మిత చేసిన కామెంట్స్‌ ఎందుకు చేశారనే దానిపై ఇన్‌ఛార్జి ఆరా తీశారు.