News April 6, 2024

HYD: ఎవరిని ఎవరు తొక్కుతారో చూద్దాం: మంత్రి

image

మాజీ సీఎం KCR వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శనివారం HYD గాంధీభవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రచ్చ చేస్తామని కేసీఆర్ అంటున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ నేతలంతా రోడ్లపైనే ఉంటారు. ఎవరు వస్తారో రండి, చూసుకుందాం. ఎవరిని ఎవరు తొక్కుతారో తేలుతుంది. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు’ అని విమర్శించారు. BRS పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.

Similar News

News January 20, 2025

HYD: త్వరలో ఐటీ కారిడార్లలో పాడ్ కార్లు..!

image

మెట్రో స్టేషన్‌ నుంచి నేరుగా కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ సంకల్పించింది. ఈ వ్యవస్థలో భాగంగా పాడ్‌ కార్‌ లేదా పాడ్‌ ట్యాక్సీలను పరిచయం చేసి ప్రత్యేక కారిడార్లలో వాటిని నడిపేందుకు రూ.1,480 కోట్ల అంచనా వ్యయంతో DPRను సిద్ధం చేసినట్లు సమాచారం. నెలాఖరులోగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించి నిధులు కోరనుంది. 

News January 20, 2025

HYD: దోబీ అనే పదం వద్దని కేంద్ర మంత్రికి వినతి

image

దోబీ అనే పదంతో తెలుగు రాష్ట్రాల్లో రజకుల హక్కులకు భంగం కలుగుతోందని రాష్ట్ర రజక మహిళా సంఘం ఫౌండర్ ఛైర్మన్ మల్లేశ్వరపు రాజేశ్వరి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు పట్నా హైకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాలను తెలుపుతూ ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ గెజిట్‌లో దోబీ అనే పదంతో ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరిగి స్థానికంగా ఉన్న రజకులకు అన్యాయం జరుగుతోందని ఆమె వాపోయారు.

News January 20, 2025

HYD: 10TH, ఇంటర్, ITI, డిగ్రీ వారికి బెస్ట్ ఛాన్స్

image

HYD నాంపల్లి పరిధి మల్లేపల్లి ITI కాలేజీలో నేషనల్ ఇంటర్న్‌షిప్ మేళా నేడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుందని అధికారులు తెలిపారు. 5వ తరగతి నుంచి 12 వరకు పాసైన వారు, ITI, బీటెక్ డిగ్రీ, ఇతర డిగ్రీలు చేసినవారికి ఇంటర్న్‌షిప్ అందించి, ఉద్యోగాలు కల్పించనున్నారు. 1000కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటారని, అన్ని జిల్లాల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.