News April 8, 2024
HYD: ఎస్ఐ రంజిత్‌కి 45 రోజుల రిమాండ్

లంచం తీసుకుంటూ ఇటీవల ACBకి పట్టుబడిన HYD మాదాపూర్ SI రంజిత్ కుమార్, కానిస్టేబుల్ విక్రమ్‌ను ACB అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి ACB కోర్టులో వారిని హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరికీ 45 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు. SI రంజిత్ IIT ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేయడం విశేషం. తర్వాత సివిల్స్ 2 సార్లు రాశారు. మెయిన్స్‌లో విఫలమవగా అనంతరం SI పరీక్షలు రాసి 2020లో జాబ్ పొందాడు.
Similar News
News November 25, 2025
సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్‌ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్‌ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
News November 25, 2025
GHMC కౌన్సిల్ హాల్లో తగ్గేదే లే!

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.
News November 25, 2025
EXCLUSIVE: 15 ఏళ్ల తర్వాత తొలుగుతోన్న ముసుగులు

GHMCలో 15 ఏళ్లుగా ముసుగు కప్పుకున్న విగ్రహాల తెర వీడుతోంది. స్టాండింగ్ కమిటీ నుంచి ఆమోదం పొంది 5 నెలలు గడిచినా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోనూ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేశారు. విగ్రహాలను తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరాయి. డిసెంబర్ మొదటి వారంలో మరోచోట విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని సమాచారం.


