News February 27, 2025

HYD: ఏంటీ SLBC టన్నెల్? (VIDEO)

image

కృష్ణానది నుంచి నల్గొండకు సాగు, HYD తాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC). ప్రపంచంలోనే ఇది 5వ అతిపెద్ద టన్నెల్. 10 మీ.ఎత్తు, 44 కి.మీటర్లు పొడవుతో నిర్మిస్తున్నారు. 5 రోజుల క్రితం NGKL జిల్లా దోమలపెంట సమీపంలో టన్నెల్‌ పైభాగం కుప్పకూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. SLBCపై BBC ప్రత్యేక కథనంపై వీడియోలో చూడండి.

Similar News

News March 20, 2025

ASF: గంజాయి పట్టివేత.. నిందితుడిపై కేసు

image

తిర్యాణి మండలం నాయకపుగూడ గ్రామానికి చెందిన మెంద్రపు చిన్నయ్య ఇంట్లో 875 గ్రాముల గంజాయిని బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు చిన్నయ్య ఇంట్లో తనిఖీ చేశామన్నారు. సుమారు రూ.21 వేల విలువైన గంజాయి లభ్యమైనట్లు చెప్పారు. గంజాయిని సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 20, 2025

బడ్జెట్లో ములుగు జిల్లా ప్రజలకు నిరాశే!

image

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ములుగు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరైన మేడారం అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కొత్తగా మున్సిపాలిటీగా అవతరించిన ములుగు పట్టణ అభివృద్ధి యాక్షన్ ప్లాన్‌కు బడ్జెట్లో చోటు దక్కలేదు. జిల్లాలోని యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడం యువత నిరాశకు లోనయ్యారు.

News March 20, 2025

పన్ను వసూళ్ళలో హుజూరాబాద్‌కు మొదటిస్థానం

image

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. అధికార్లు, సిబ్బంది ముందు కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా పని చేయటం వల్ల ఈ విజయం సాధించామన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.

error: Content is protected !!