News October 20, 2024

HYD: ఏకంగా బ్యాంకులనే రూ.528.26 కోట్ల మోసం..!

image

హైదరాబాద్‌లో నకిలీ పత్రాలతో ఏకంగా రూ.528.26 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన శ్రీకృష్ణ స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ పై ED విచారణ జరిపింది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల నుంచి శ్రీకృష్ణ సంస్థ ప్రతినిధులు నకిలీ పత్రాలతో రుణాలు పొంది, చెల్లింపుల్లో జాప్యం చేసి, లోన్ వచ్చాక అవసరాలకు కాకుండా వేరే ఖాతాల్లోకి సొమ్ము మళ్లించారు.

Similar News

News November 5, 2024

ధ్రువీకరణ పత్రాలు సత్వరమే అందించాలి: HYD కలెక్టర్

image

డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ దరఖాస్తులు, రెవెన్యూ అంశాల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆర్డీఓలు, తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ధ్రువీకరణ పత్రాలు సత్వరమే అందించాలని సూచించారు.

News November 4, 2024

HYD: ప్రజాపాలన ప్రోగ్రాం ఎన్నడూ..?

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో గ్రేటర్ HYDలో DEC-28 నుంచి JAN-6వ తేదీ వరకు తొలి విడతగా ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ప్రతి 4 నెలలకోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పినప్పటికీ, అది సాధ్యం కాలేదు. దీంతో మొదటి విడతలో దరఖాస్తు చేసుకొని వారు ఉప్పల్, మల్కాజ్‌గిరి సహా GHMC సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News November 4, 2024

HYD: పోలీసులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించిన DGP

image

HYD నగర శివారు మంచిరేవుల వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంను డీజీపీ జితేందర్ ప్రారంభించారు. ఫేజ్-4 ప్రోగ్రాం అద్భుతంగా జరుగుతుందన్నారు. నేర్చుకోవడంలో ఉన్న ఆత్మ సంతృప్తి ఎందులో దొరకదని DGP అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు సైతం పాల్గొన్నారు.