News December 5, 2024
HYD: ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న వర్సిటీ రిజిస్ట్రార్…!

JNTU రిజిస్ట్రార్ తీరు పై వర్సిటీ డైరెక్టర్ లే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వర్సిటీలు డైరెక్టర్లకు కార్లు, డ్రైవర్ల కేటాయింపులో రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వివక్ష చూపిస్తున్నారని కొందరు డైరెక్టర్లు ఆరోపించారు. బుధవారం రిజిస్ట్రార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈవిషయం చర్చకు రాగా సమావేశం కాస్త రసాభాసగా మారింది. వర్సిటీలో పాలనాపరంగా రిజిస్ట్రార్ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఆరోపించారు.
Similar News
News November 26, 2025
GHMCలో విలీనం.. తర్వాత బాదుడే.. బాదుడు

GHMCలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ అధికారికంగా ముగిసిన అనంతరం ఆయా ప్రాంతాలకు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పన్నులు పడే అవకాశముంది. ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ట్రేడ్ లైసెన్సులు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. విధి, విధానాలు ప్రభుత్వం ఇంకా పూర్తిగా రూపొందించలేదు. విలీన ప్రక్రియ సమగ్రంగా ముగిసిన తర్వాత పన్నుల లెక్క తేలుతుంది. దీనిపై మీ కామెంట్
News November 26, 2025
HYD: బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన KTR

తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ లో ఘాటుగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన రాహుల్ గాంధీ, పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని KTR ప్రశ్నించారు.
News November 26, 2025
నగరం.. మహానగరం.. విశ్వనగరం

అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇదీ సిటీ పరిస్థితి. ఇక ఔటర్ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిసిన తర్వాత విశ్వనగరంగా మారనుంది. జనాభా కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రేటర్ జనాభా 1.40 కోట్లు ఉండగా విలీనం తర్వాత 1.70 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.


