News March 27, 2025
HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.
Similar News
News April 2, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

☞ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ ☞ అహోబిలేశుని సన్నిధిలో MLA భూమా దంపతులు ☞ శ్రీశైల మల్లన్న దర్శించుకుని.. SLBC టన్నెల్ పరిశీలించిన తెలంగాణ మంత్రి పొంగులేటి ☞ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాలలో ధర్నా ☞ యాగంటి క్షేత్రానికి మంత్రి బీసీ వరాల జల్లు ☞ నంద్యాలలో FAPTO ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా ☞ మహా ‘నంది’కి మేఘాల పందిరి ☞ క్రీడాకారులకు ఆరు వారాల సర్టిఫికెట్ కోర్స్: DSO
News April 2, 2025
IPL: గుజరాత్ టార్గెట్ 170 రన్స్

GTతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 169-8 స్కోర్ చేసింది. లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33) రాణించారు. కోహ్లీ (7), సాల్ట్ (14), పడిక్కల్ (4), పాటీదార్ (12) నిరాశపరిచారు. చివర్లో టిమ్ డేవిడ్ (32) మెరుపులు మెరిపించారు. GT బౌలర్లలో సిరాజ్ 3, సాయి కిశోర్ 2 వికెట్లు తీయగా, అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ తలో వికెట్ పడగొట్టారు.
News April 2, 2025
లాలూ కోరికను ప్రతిపక్షం తీర్చలేకపోయింది.. మేం తీరుస్తున్నాం: షా

వక్ఫ్ ఆస్తులు లూటీ కాకుండా ఉండేందుకు అత్యంత కఠినమైన చట్టాలు రావాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కోరుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో గుర్తుచేశారు. ‘2013లో అప్పటి యూపీఏ సర్కారు సవరణ బిల్లును ప్లాన్ చేస్తే లాలూ స్వాగతించారు. ‘వక్ఫ్ బోర్డులో సభ్యులు చాలా భూముల్ని అమ్మేశారు. సవరణను మేం సమర్థిస్తున్నాం’ అని అన్నారు. ఆయన కోరికను మీరు నెరవేర్చలేదు. మోదీ చేశారు’ అని పేర్కొన్నారు.