News August 19, 2024
HYD: ఏడో తరగతి బాలికపై లైంగిక దాడి

బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సైదాబాద్ డివిజన్లోని బస్తీవాసి (58) కేంద్ర ప్రభుత్వ సంస్థలో కింది స్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇంటి పక్కన ఉండే ఏడో తరగతి చదువుతున్న బాలికకు చాక్లెట్ల ఆశ చూపి ఇంట్లోకి పిలిచాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈనెల 11న ఘటన జరగగా.. బాలిక కుటుంబసభ్యులు 13న ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్: నిరుద్యోగి యువతి అస్మాకు 107 ఓట్లు

కాంగ్రెస్‌ను ఓడిస్తేనే తమకు సీఎం రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెబుతూ ప్రచారం చేసిన నిరుద్యోగ యువతి, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగంకు 0.05 శాతం అంటే 107 ఓట్లు పోలయ్యాయి. గెలుపు కోసం కాదు నిరుద్యోగుల వాయిస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపించాలనే తాను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తానని చెప్పిన అస్మాకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
News November 14, 2025
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందు ఉండి పని చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. డివిజన్ల వారీగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రిగా ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, రోహిన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: జనసేన మద్దతు.. అయినా BJPకి డిపాజిట్ గల్లంతు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJPకి డిపాజిట్ గల్లంతవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు. ఏపీలో NDA కూటమి ప్రభుత్వం ఉండడంతో ఇక్కడి ఏపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన BJPకి మద్దతు తెలిపింది. అయినా ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. కాగా ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మీటింగ్‌లు, ర్యాలీలలో TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు దర్శనమిచ్చాయి. తెలంగాణ TDP నేతలు కాంగ్రెస్ వైపు నిలిచారనే చర్చ కూడా కొనసాగింది.


